Former union minister and senior BJP leader Arun Jaitley breathed his lost breath a short while ago. Many political personalities on Jaitley's demise and chief ministers of several States were condolenced. President Ramnath Kovind, Deputy president Venkaiah Naidu, Prime Minister Narendra Modi, Telangana cm Chandrasekhar Rao, AP CM Jagan Mohan Reddy and AP Former chief minister Chandrababu Naidu were deeply condolenced at Jaitley's Demise
#arunjaitely
#ramnathkovind
#primeministermodi
#kcr
#ysjaganmohanreddy
#narachandrababunaidu
#soniagandhi
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణం పట్ల రాష్ట్ర పతి రాంనాధ్ కోవింద్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, కేటీఆర్ స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతే కాకుండా ఏపీ సీఎం జగన్ సంతాపాన్ని తెలుపుతూ రాజకీయాల్లో సుధీర్గ నేతగా కొనసాగిన నేత, న్యాయ కోవిదుడు జైట్లీ మరణం దేశానికి పూడ్చలేనిదని తెలిపారు.ఇదిలా ఉండగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 9న ఆసుపత్రిలో చేరిన అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం 12.09 గంటలకు తుదిశ్వాస విడిచారు.